న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇండిగో పేరుతో విమాన సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్..బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలోకి ప్రవేశించనున్నది. వచ్చే నెల 22 నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు ట్రేడైన టాటా మోటర్స్ ప్యాసింజర్ వేహికల్ ఈ సూచీ నుంచి వైదొలగనున్నది. ఈ విషయాన్ని బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సూచీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పులు చేసినట్టు బీఎస్ఈ ఇండెక్స్ వెల్లడించింది. అలాగే బీఎస్ఈ 100 ఇండెక్స్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్థానంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ చోటు దక్కించుకున్నది. అలాగే బీఎస్ఈ సెన్సెక్స్ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ స్థానంలో మ్యాక్ హెల్త్‌కేర్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్ భర్తికానున్నది.