Mega Aviation Deal | 500 ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయనున్న ఇండిగో
ప్రైవేట్ విమానయాన సంస్ధ ఇండిగో 500 ఎయిర్‌బస్ ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయనుంది. ఇది విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందంగా (Mega Aviation Deal) నిలవనుంది.
న్యూఢిల్లీ : ప్రైవేట్ విమానయాన సంస్ధ ఇండిగో 500 ఎయిర్‌బస్ ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయనుంది. ఇది విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందంగా (Mega Aviation Deal) నిలవనుంది. 5500 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందం పౌర విమానయాన రంగంలో అతిపెద్ద ఆర్డర్‌గా నమోదైంది. ఇండిగో చీఫ్ పీటర్ ఎల్బర్స్ ఈ చారిత్రాత్మక డీల్ వివరాలను సోమవారం ప్రకటించారు.
గత కొద్దిరోజులుగా ఈ భారీ డీల్‌పై ఎయిర్‌బస్, ఇండిగో జరుపుతున్న చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండిగో డీల్‌తో పాటు ఎయిర్‌బస్ సౌదీ ఎయిర్‌లైనర్ ఫ్లైనాస్ కోతో కూడా ప్రతిష్టాత్మక ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కసరత్తు సాగిస్తోందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వెల్లడించింది.
కాగా, ఈ ఒప్పందాలకు సంబంధించి అధికారిక ప్రకటనలను అందించేందుకు ఎయిర్‌బస్, ఇండిగో, ఫ్లైనాస్ ప్రతినిధులు నిరాకరించారు. ఇండిగో, ఎయిర్‌బస్ భారీ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగుచూడాల్సి ఉంది.
Read More :
iPhone Exports | ఒక్క నెలలో ఐ-ఫోన్ల ఎగుమతుల్లో న్యూ రికార్డు.. ఎంతో తెలుసా?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- A320 aircraft
- Airbus
- indigo
- Order
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

