న్యూఢిల్లీ, నవంబర్ 6: టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న వాహన విక్రయాలకు ద్విచక్ర వాహనాలు గండికొట్టాయి. గత నెలలో మొత్తంగా దేశవ్యాప్తంగా 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్(ఫడా) వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో అమ్ముడైన 22,95,099 యూనిట్లతో పోలిస్తే 8 శాతం తగ్గాయని సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
గత నెలలో తొలి పక్షం రోజుల్లో వాహనాలు కొనుగోలు చేయడానికి కస్టమర్లు వెనుకంజవేశారు. ప్రస్తుతం నవరాత్రి సీజన్ కావడంతో ఈ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉన్నది.
-మనీష్ రాజ్ సింఘానియా, ఫడా ప్రెసిడెంట్