Tax Evation | స్టార్టప్‌లు.. నవతరం టెక్ సంస్థలు.. వ్యక్తిగత పెట్టుబడులతో మొదలయ్యే ఈ సంస్థలు.. ఒడిదొడుకులను ఎదుర్కొంటూ.. ముందుకు సాగుతాయి. ఆయా రంగాల్లో నిలదొక్కుకున్నాక ఇన్వెస్టర్ల.. వెంచర్ ఫండింగ్‌తో ముందుకు సాగుతుంటాయి. అలా ఏర్పాటైనవే మూడు ఇండియన్ స్టార్టప్‌లు.. ఫస్ట్ క్రై డాట్ కాం, గ్లోబల్ బీస్ బ్రాండ్స్ లిమిటెడ్, ఎక్స్ ప్రెస్బీస్.. వాటి ఫౌండర్ ఒకరే. ఆర్థిక లావాదేవీలు నిర్వహించినప్పుడు ప్రారంభంలో నష్టాలు వస్తే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో చూపడం చాలా తేలిక.. కానీ లాభాల్లోకి వచ్చేసిన ఈ స్టార్టప్‌ల ఫౌండర్ 50 మిలియన్ డాలర్లకు మన కరెన్సీలో రూ. 41,30,53,750 మేరకు ఆదాయం పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయం పన్ను విభాగం గుర్తించినట్లు తెలుస్తున్నది.
ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న ఫస్ట్ క్రై డాట్ కాం వ్యవస్థాపకులు సుపం మహేశ్వరికి ఆదాయం పన్ను విభాగం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈక్విటీ లావాదేవీలు నిర్వహించిన ఫస్ట్ క్రై డాట్ కాం ఆదాయంపై రూ.41.30 కోట్ల పై చిలుకు పన్ను ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించినట్లు తెలియవచ్చింది.
చిరస్ కాపిటల్ మేనేజ్మెంట్ అండ్ కో, సునీల్ మిట్టల్ ఫ్యామిలీ ఆఫీసుతోపాటు ఆరుగురు ఫస్ట్ క్రై డాట్ కాం ఇన్వెస్టర్లకు ఆదాయం పన్ను విభాగం నోటీసులు అందాయి. విచారణ జరుపుతున్న ఐటీ అధికారులతో సుపం మహేశ్వరి సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు వినికిడి.
ఐటీ నోటీసుల విషయమై సుపం మహేశ్వరి గానీ, చిరస్ క్యాపిటల్ గానీ, ఆదాయం పన్ను విభాగం అధికారులు గానీ, సునీల్ మిట్టల్ ఫ్యామిలీ గానీ స్పందించలేదు. విచారణపైనా వ్యాఖ్యానించేందుకు అందుబాటులోకి రాలేదు. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ క్రై డాట్ కామ్ లాభాల్లోకి వచ్చిందని బ్లూంబర్గ్ ఇంతకుముందు ఓ వార్తాకథనం ప్రచురించింది. ఏండ్ల తరబడి నష్టాల తర్వాత లాభాల్లోకి వచ్చిన ఫస్ట్ క్రై.. ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి ప్రయత్నిస్తున్న తొలి ఇండియన్ స్టార్టప్ ‘ఫస్ట్ క్రై డాట్ కామ్’ అని పేర్కొంది.