Retail Inflation | రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెల ద్రవ్యోల్బణం రెండేండ్ల కనిష్ట స్థాయి.. 4.7 శాతం నుంచి 4.25 శాతానికి దిగి వచ్చింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం.. వరుసగా మూడో నెల ఆర్బీఐ నియంత్రణ స్థాయి కంటే తక్కువ నమోదైంది. ఆరు శాతం కంటే తక్కువగా ద్రవ్యోల్బణం నమోదైతే ఆర్బీఐ నియంత్రణ స్థాయి కంటే తక్కువ.
తృణధాన్యాలు, కూరగాయలతోపాటు ఇంధన ధరలు తగ్గడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం వల్ల గతేడాది మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతంగా నమోదైంది. 2021 ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతంగా రికార్డైంది. నాటి నుంచి మళ్లీ ఆ స్థాయికి చిల్లర ద్రవ్యోల్బణం దిగి రావడం ఇదే మొదటి సారి.
రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార ధరలు దాదాపు 50 శాతం. ఏప్రిల్‌లో ఆహార వస్తువుల ధరలు 3.84 శాతం ఉంటే.. మే నెలలో 2.91 శాతానికి దిగి వచ్చాయి. గ్రామీణ రిటైల్ ద్రవ్యోల్బణం 4.17 శాతంగా ఉంటే, పట్టణ ద్రవ్యోల్బణం 4.27 శాతంగా నమోదైంది. 2019 సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి కంటే తక్కువగా రికార్డైంది.