న్యూఢిల్లీ, మే 6 : ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మరోసారి ధరలను పెంచింది. లంప్సం, నాణ్యమైన ఖనిజ టన్ను ధరను రూ.200 సవరించింది. దీంతో బైలా లంప్సం ధర రూ.5,500కి చేరుకోగా, నాణ్యమైన ఖనిజం రూ.4,700 పలికింది.
లంప్సం ఖనిజంలో 65.5 శాతం ఖనిజం ఉండనుండగా, నాణ్యమైన గ్రేడ్ రకంలో 64 శాతం మాత్రమే ఖనిజం ఉండనున్నది. ప్రతినెల సంస్థ ధరల్లో మార్పులు చేస్తుండగా, కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.