Industrial Production | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి మందగించింది. ఈ ఏడాది జూలైలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.8 శాతానికే పరిమితమైంది. నిరుడు జూలైలో 6.2 శాతంగా ఉండటం గమనార్హం. తయారీ, గనుల రంగాల పేలవ ప్రదర్శనే ఈ క్షీణతకు కారణమని గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాల్లో సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
గతంతో పోల్చితే గనుల రంగంలో ఉత్పాదకత 10.7 శాతం నుంచి 3.7 శాతానికి, తయారీ రంగంలో 5.3 శాతం నుంచి 4.6 శాతానికి దిగజారింది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో స్వల్పంగా పెరిగి 3.65 శాతంగా నమోదైంది. అంతకుముందు జూలైలో 3.6 శాతంగా ఉన్నది.