ముంబై, జూన్ 16 : దేశీయ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. మే నెలకుగాను 2.49 శాతం తగ్గి 2,047.89 మిలియన్ డాలర్లు (రూ.19, 573.96 కోట్లు)కు పరిమితమయ్యాయనని జెమ్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది. బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి కొనసాగుతుండటం, సరఫరా వ్యవస్థలో నెలకొన్న అవాంతరాలతో ఎగుమతులు నీరసించాయని పేర్కొంది.
అంతక్రితం ఏడాది ఇదే నెలలో 2,100.21 మిలియన్ డాలర్ల ఆభరణాలు ఎగుమతి అయ్యాయి. గత నెలలో మొత్తంగా బంగారు ఆభరణాల ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 14.75 శాతం తగ్గి 758.44 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వెల్లడించింది.