ముంబై, మార్చి 1: వరుసగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరి 23తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.975 బిలియన్ డాలర్లు పెరిగి 619.072 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. విదేశీ కరెన్సీ రూపంలోవున్న ఆస్తుల విలువ పెరగడం ఇందుకు దోహదం చేశాయని పేర్కొంది. గతవారాంతానికి విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 2.405 బిలియన్ డాలర్లు ఎగబాకి 548.188 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే పసిడి రిజర్వులు 473 మిలియన్ డాలర్లు ఎగబాకి 47.848 బిలియన్ డాలర్లకు చేరుకోగా..ఎస్డీఆర్లు 89 మిలియన్ డాలర్లు అధికమై 18.197 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలు 9 మిలియన్ డాలర్లు అధికమై 4.839 బిలియన్ డలర్లకు చేరాయి.