ముంబై, మే 24: విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన వారాంతానికిగాను 4.549 బిలియన్ డాలర్లు ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి 648.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. వరుసగా మూడు వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ నిల్వలు ఏప్రిల్ 5తో వారాంతానికిగాను ఆల్‌టైం హై 648.562 బిలియన్ డాలర్లకు చేరాయి.