Forex Reserves | ఇంతకుముందు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్న విదేశీ మారక ద్రవ్యం నిల్వలు (Forex Reserves) మళ్లీ తగ్గాయి. ఈ నెల 14తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 4.307 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 655.817 బిలియన్ డాలర్లతో ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.
వరుసగా కొన్ని వారాలుగా పెరిగిన ఫారెక్స్ రిజర్వు నిల్వలు ఈ నెల 14వ తేదీతో మళ్లీ తగ్గాయి. ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో ప్రధానమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ 2.097 బిలియన్ డాలర్లు తగ్గి 574.24 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం రిజర్వు నిల్వలు సైతం 1.015 బిలియన్ డాలర్లు పడిపోయి 55.967 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) 54 మిలియన్ డాలర్లు క్షీణించి 18.107 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ రిజర్వు నిల్వలు 245 మిలియన్ డాలర్లు పెరిగి 4.581 బిలియన్ డాలర్లకు చేరాయి.
Oppo A3 Pro | ఒప్పో నుంచి మరో బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Gold-Silver Rates | భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు.. యూఎస్ ఫెడ్ రిజర్వుపైనే ఆశలు..!
Petrol Rates – Goa | గోవాలో పెట్రోల్, డీజిల్ పిరం.. సామాన్యులకు బీజేపీ సర్కార్ షాక్