Matter Aera E-Bike | యూత్‌ను ఆకట్టుకునేలా తొలి ఈ-బైక్ మ్యాటర్ ఏరా.. సింగిల్ చార్జితో 125 కిమీ ప్రయాణం
Matter Aera E-Bike | యూత్‌ను ఆకర్షించే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న తొలి గేర్ ఎలక్ట్రిక్ బైక్ `ఏరా`ను స్టార్టప్ సంస్థ మ్యాటర్ ఎనర్జీ ఆవిష్కరించింది. పూర్తిగా స్పోర్టీ లుక్‌తో ఉన్న ఈ బైక్ ధర రూ.1.44 లక్షల నుంచి మొదలవుతుంది.
Matter Aera E-Bike | అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ మ్యాటర్ ఎనర్జీ.. మోడర్న్ టెక్నాలజీతో దేశీయ మార్కెట్లోకి తొలి గేర్ ఎలక్ట్రిక్ బైక్ `మ్యాటర్ ఏరా (Matter Aera)`ను ఆవిష్కరించింది. దేశంలోకి మొట్టమొదటిసారి వస్తున్న గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇది. 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో వస్తున్నది. ఆటో ఎక్స్పో-2023లో `ఏరా`ను మ్యాటర్ ఎనర్జీ ఆవిష్కరించింది. యువతను ఆకట్టుకునేలా పూర్తిగా స్పోర్ట్స్ లుక్‌తో వస్తున్న దీని ప్రత్యేకతలు తెలుసుకుందామా..!
- సింగిల్ చార్జితో 125 కి.మీ దూరం ప్రయాణం చేయొచ్చు.
- ఈ బైక్ నాలుగు ట్రిమ్ ఆప్షన్లు 4000, 5000, 5000+, 6000+ వేరియంట్లలో లభ్యం.
- ఏరా 5000 బైక్ రూ.1,43,999, ఏరా 5000 + బైక్ రూ.1,53,999లకు లభ్యం.
- ఏరా 4000, ఏరా 6000+ వేరియంట్ బైక్‌లు ఇంకా తయారు కాలేదు.
- 5000, 5000+ బైక్‌ల బుకింగ్స్ ప్రారంభం.
- మూడేండ్ల వారంటీ ప్లస్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఏఎంసీ/లేబర్ కవరేజ్.
- ఏరా 4000, ఏరా 5000 + వేరియంట్ బైక్‌లు 5-కిలోవాట్ల లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్.
- సింగిల్ చార్జింగ్‌తో 125 కి.మీ. దూరం ప్రయాణ సామర్థ్యం. బ్యాటరీ ప్యాక్‌పై మూడేండ్ల వారంటీ.
- నార్మల్ చార్జర్‌తో ఐదు గంటలు, ఫాస్ట్ చార్జర్‌తో రెండు గంటల్లో చార్జింగ్.
- ఏబీఎస్‌తోపాటు ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్.
- ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్స్.
- ఐసీఈబైక్లపై ఇంజిన్ గార్డ్, స్ప్లిట్ సీట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్, స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఫర్ ఫిల్లోన్ రైడర్.
- 10కిలోవాట్ల ఎలక్ట్రిక్ వాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటర్తో ఏరా 5000, ఏరా 5000 + బైక్స్ సిద్ధం.
- హైపర్ షిఫ్ట్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్.
- ఆరు సెకన్లలోపే 60 కి.మీ. వేగంతో దూసుకెళ్లే కెపాసిటీ.
- ఎకో మోడ్‌లో గరిష్టంగా 30 కి.మీ., సిటీ మోడ్‌లో 70 కి.మీ., స్పోర్ట్ మోడ్‌లో 95 కి.మీ.
కనెక్టివిటీ ఇలా..
4జీ, వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, పార్క్ అసిస్ట్, కీలెస్ ఆపరేషన్, ఓటీఏ అప్డేట్స్, ప్రోగ్రెసివ్ బ్లింకర్స్, 7-అంగుళాల టచ్-కంపాటిబుల్ ఎల్సీడీ డిస్ప్లే విత్ వెల్కం లైట్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

