KTR | జైకాతో ఒప్పందం గర్వకారణం.. మా కృషికి దక్కిన ఫలితం.. ఎక్స్ వేదికగా కేటీఆర్ సంతోషం
KTR | కొన్నేండ్లుగా తాము చేస్తున్న కృషి ఫలించినందుకు ఆనందంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు సంతోషం వ్యక్తంచేశారు.
- మా కృషికి దక్కిన ఫలితం ఎక్స్ వేదికగా కేటీఆర్ సంతోషం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కొన్నేండ్లుగా తాము చేస్తున్న కృషి ఫలించినందుకు ఆనందంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు సంతోషం వ్యక్తంచేశారు. ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి రూ.1,336 కోట్ల రుణం అందించేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జైకా)తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఈ ఒప్పందం కుదరడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇది దేశంలోని స్టార్టప్ రంగంలో జైకా సంస్థ పెడుతున్న మొదటి పెట్టుబడి అని తెలిపారు. 2019లోనే తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను సందర్శించాలని జైకా ప్రతినిధి బృందాన్ని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రాజెక్ట్ రూపురేఖలను పరిశీలించిన తర్వాత, జైకా బృందంతో సంవత్సరాలపాటు నిరంతర చర్చలు, సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో భారత్, జపాన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారని వివరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- JICA
- KTR
- X platform
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

