Indian Railway | భారతీయ రైల్వే నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నది. ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వేలు వేలాది రైళ్లను నడుపుతున్నాయి. ఈ రైళ్లు దేశంలోని దాదాపు ప్రతి ప్రధాన భూభాగాన్ని ఒకదానితో మరొకదాన్ని కలుపుతున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ రైల్వే దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా నిలిచింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నది. భారతీయ రైల్వేలు ప్రజా రవాణాకు, సరుకు రవాణాలో ముఖ్య భూమిక పోషిస్తున్నది. దాంతో వ్యాపారులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తక్కువ ఖర్చుతోనే వస్తువులను పంపడం పంపొచ్చు. రవాణా కోసం చాలామంది ఎక్కువ రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో భారతీయ రైల్వేకు ఒక రోజు ఎంత ఆదాయం వస్తుందో చాలామందికి తెలియదు. మీడియా నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ రూ.400కోట్లు సంపాదిస్తున్నాయి.
సరుకు రవాణాతో భారీగా ఆదాయం సమకూరుతున్నది. భారతీయ రైల్వేల నెలవారీ ఆదాయం దాదాపు రూ.12వేలకోట్లు. భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా వేల సరుకు రవాణా రైళ్లను నడుపుతున్నాయి. లక్షల టన్నుల వస్తువులను ఒకటి నుంచి మరొకటి చేరవేస్తున్నాయి. గూడ్స్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లు కూడా భారతీయ రైల్వేలకు చాలా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గూడ్స్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లతో పాటు, రైల్వేలు జారీ చేసే స్క్రాప్ టెండర్ల నుంచి రైల్వేలు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. భారతీయ రైల్వేలు దేశంలో ఉపాధి వనరు. దేశంలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నది. ఇందులో రైల్వే ఉద్యోగులతో పాటు తయారీ రంగం, ప్లాట్‌ఫామ్‌లపై, రైల్వే స్టేషన్లలో పలువురు వ్యాపారాలు చేస్తుండగా.. మరికొందరు ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.