Brahmos Missile | త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్స్‌ను ఎగుమతి చేయనున్న భారత్..!
Brahmos Missile | రక్షణ రంగంలో స్వావలంభన దిశగా ఎదుగుతున్న భారత్ మరో ఘనతను సొంతం చేసుకోబోతున్నది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DDO) ఈ ఏడాది మార్చి నాటికి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఎగుమతి చేయనున్నది.
Brahmos Missile | రక్షణ రంగంలో స్వావలంభన దిశగా ఎదుగుతున్న భారత్ మరో ఘనతను సొంతం చేసుకోబోతున్నది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DDO) ఈ ఏడాది మార్చి నాటికి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఎగుమతి చేయనున్నది. ఈ విషయాన్ని డీఆర్డీవో చీఫ్ సమీర్ వీ కామత్ ధ్రువీకరించారు. డీఆర్డీవో చీఫ్ గురువారం జాతీయ మీడియాతో మాట్లాడారు.
డీఆర్డీవో రాబోయే పది రోజుల్లో పది రోజుల్లో క్షిపణుల గ్రౌండ్ సిస్టమ్‌లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందన్నారు. అంతే కాకుండా డీఆర్డీవో అభివృద్ధి చేసిన, భారత్ ఫోర్జ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తదితర ప్రైవేట్ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఏటీఏజీఎస్ 307 గన్స్కు విదేశాల నుంచి ఆర్డర్లు ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రావచ్చన్నారు. ఫిలిప్పీన్స్‌తో పాటు పలు దేశాలు బ్రహ్మోస్ క్షిపణిపై ఆసక్తి చూపుతున్నాయని డీఆర్డీవో చీఫ్ తెలిపారు.
ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఏటీఏజీఎస్ గన్స్ ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయని తెలిపారు. వాటికి మార్చి 31 వరకు ఆర్డర్ వస్తుందని ఆయన అంచనా వేశారు. ఇప్పటి వరకు డీఆర్డీవో ఉత్పత్తి చేస్తున్న ఆయుధాలను త్వరలో సైన్యంలోని మూడు విభాగాల్లో చేరనున్నాయని ఆయన వెల్లడించారు. ఎల్సీఏ ఎంకే-1ఏ, అర్జున్ ఎంకే-1ఏ, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ తదితర క్షిపణులు త్వరలోనే సైన్యంలో భాగమవుతాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- BrahMos missile
- DDO
- DRDO
- March 31
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

