న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..తన తొలి ఎలక్ట్రిక్ వాహనమైన ఈ విటారాను ప్రదర్శించింది. వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ కారుపై అప్పుడే భారీ అంచనాలునెలకొన్నాయి.
49 కిలోవాట్లు, 61 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 543 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. దేశవ్యాప్తంగా 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పబోతున్నట్టు మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాచీ తకేచి తెలిపారు.