4.75 లక్షల కోట్లు.. 2020లో ఇండియాకు వచ్చిన ఎఫ్‌డీఐలు ఇవి

ముంబై: ఇండియాకు 2020లో భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. గతేడాది 6400 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.75 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐలు వచ్చినట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే ఐదో అత్యధికమని తెలిపింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తాత్కాలిక ప్రభావం పడనుందని ఈ రిపోర్ట్ చెప్పింది. యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021ని సోమవారం విడుదల చేసింది.
నిజానికి గతేడాది కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపిందని, అంతకుముందు ఏడాది 1.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు, గతేడాది 1 లక్ష కోట్ల డాలర్లకే పరిమితమైందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు కొనసాగుతున్న పెట్టుబడుల ప్రాజెక్టుల వేగాన్ని తగ్గించిందని తెలిపింది.
అయితే ఇండియాలో మాత్రం ఎఫ్‌డీఐలు 27 శాతం పెరిగి 6400 కోట్ల డాలర్లకు చేరినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే ఐదో అత్యధిక ఎఫ్‌డీఐల మొత్తమని తెలిపింది. మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరిగిందని, ఇది కూడా ఇండియాలో ఎఫ్‌డీఐ వృద్ధికి దోహదపడిందని ఆ నివేదిక తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

