హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9(నమ స్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో నివాస గృహాల విక్రయాల్లో పెరుగుదల నమోదైందని, గతేడాది మే నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో జరిగిన విక్రయాలు 31 శాతం వృద్ధి నమోదైందని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. మే-2023లో 5,877 అపార్టుమెంట్ యూనిట్లు విక్రయించడం ద్వారా మొత్తం రూ.2,994 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. హైదరాబాద్ రెసిడెన్షియల్ మారెట్లో హైదరాబాద్, మేడ్చల్-మలాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలు ఉన్నాయి. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్ల మొత్తం 55 శాతం రూ.25-50 లక్షల పరిధిలో ఉన్నాయని, మొత్తం అమ్మకాల్లో 1000-2000 చదరపు అడుగుల మధ్య ఉన్న గృహాలు 70 శాతంగా ఉన్నాయి.