ముంబై, డిసెంబర్ 15: ఫారెక్స్ రిజర్వులు భారీగా పుంజుకున్నాయి. ఈ నెల 8తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 2.816 బిలియన్ డాలర్లు పెరిగి 606.859 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 6.107 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పెరగడం వల్లనే రిజర్వులు అధికమయ్యాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.089 బిలియన్ డాలర్లు అధికమై 536.699 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిపింది. పసిడి రిజర్వులు 199 మిలియన్ డాలర్లు కరిగిపోయి 47.13 బిలియన్ డాలర్లకు చేరాయి.