IT Returns | మీరు వేతన జీవులా.. వ్యాపారం వనరుగా ఆదాయం సంపాదించడం లేదా.. అయితే, ఈ నెలాఖరు లోగా వ్యక్తులు తమ ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ వార్షిక ఆదాయం పరిమితిని మించి ఉంటే పన్ను చెల్లించాల్సిందే. శ్లాబ్ సిస్టమ్ ప్రకారం ఆదాయం పన్ను విధిస్తారు. ఆదాయం పెరిగినా కొద్దీ, పన్ను రేట్లలో మార్పులు వస్తాయి. వార్షిక ఆదాయం ఆధారంగా పన్ను చెల్లింపుదారుల ఐటీ శ్లాబ్లు విభిన్నం. పన్నునిబంధనల ప్రకారం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులను మూడు క్యాటగిరీల్లో విభజించారు.
* 60 ఏండ్ల లోపు వ్యక్తులు (భారతీయులు, ఎన్నారైలు)
* రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు (60-80 ఏండ్లలోపు వయస్సు వారు)
* రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు (80 ఏండ్లపై చిలుకు వయస్సు గల వారు)
* పన్ను చెల్లింపుదారుల్లో సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్ల వారీగా కొన్ని బెనిఫిట్లు పొందొచ్చు.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారు.. ఫైనాన్సియల్ ఇయర్ (financial year)గా 2021-2022, అసెస్మెంట్ ఇయర్ (assessment year)గా 2022-2023 నమోదు చేయాలి. పాత, నూతన పన్ను విధానాల్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. నూతన ఐటీ విధానం తక్కువ పన్ను రేట్లు ఆఫర్ చేస్తుంది. రూ.15 లక్షల్లోపు వార్షిక ఆదాయం గల వేతన జీవులు పన్ను చెల్లించాల్సిందే. పరిమితమైన డిడక్షన్లు, మినహాయింపులు ఉంటాయి.
ఆర్థిక సంవత్సరం (2021-22) & అసెస్మెంట్ ఇయర్ (2022-23) ఐటీ శ్లాబ్స్ ఇవే..!
ఆదాయం ————– పన్ను రేట్లు ——————————- పన్ను రేట్లు
పన్ను శ్లాబ్ ———— నూతన పన్ను విధానం —————— పాత పన్ను విధానం
రూ.25 వేలలోపు ——- శూన్యం ———————————— శూన్యం
రూ.2,50,001 నుంచి
రూ.5,00,000 వరకు —- 5% —————————————- 5%
రూ.5,00,001 నుంచి —- రూ.12,500 + రూ.5 లక్షలు దాటితే —- రూ.12,500 + రూ.5 లక్షలు దాటితే
రూ.7,50,000 వరకు —– 10 శాతం పన్ను ————————- 20% పన్ను+
రూ.7,50,001 నుంచి — రూ.37,500 + రూ.7.5 లక్షలు దాటితే — రూ.62,500 + రూ.7.5 లక్షలు దాటితే
రూ.10,00,000 వరకు — 15 శాతం పన్ను ————————— 20% పన్ను+
రూ.10,00,001 నుంచి — రూ.75,000 + రూ.10 లక్షలు దాటితే —– రూ.1,12,500 + రూ.10 లక్షలు దాటితే
రూ.12,50,000 వరకు — 20శాతం పన్ను —————————- 30% పన్ను+
రూ.12,50,001 నుంచి – రూ.1,25,000 + రూ.12.50 లక్షలు దాటితే — రూ.1,87,500 + రూ.12.50 లక్షలు దాటితే
రూ.15,00,000 వరకు — 25 శాతం పన్ను —————————— 30% పన్ను+
రూ.15.00 లక్షల — రూ.75,000 + రూ.15 లక్షలు దాటితే ————– రూ.2,62,500 + రూ.15 లక్షలు దాటితే
పై చిలుకు ——– 30 శాతం పన్ను ———————————– 30% పన్ను+