IT Calculator | వేతన జీవులు ప్రతియేటా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. పన్ను ఆదా పథకాల్లో పొదుపు చేయకుంటే వారి ఆదాయాన్ని బట్టి ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు పాత, కొత్త ఐటీ విధానం అమల్లో ఉన్నాయి. ఏ విధానంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఉపయోగం. ఎంత పన్ను చెల్లించాలనే సందేహాలు ప్రతి ఒక్కరికీ వస్తాయి. ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ఎదురవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆదాయం పన్నుశాఖ కొత్తగా తన పోర్టల్లో టాక్స్ కాలిక్యులేటర్ అందుబాటులోకి తెచ్చింది. దీని ఆధారంగా ఏ పన్ను విధానంలో ఎంత పన్ను ఆదా చేయొచ్చు.. ఎంత పన్ను విధించాలి అన్న విషయాలు తేలిగ్గా తెలుసుకోవచ్చు.
ఆదాయం పన్ను కాలిక్యులేటర్ కోసం ఆదాయం పన్నుశాఖ వెబ్సైట్ www.incometax.gov.inలోకి వెళ్లాలి. అటుపై క్విక్ లింక్స్లో కనిపించే ‘ఇన్ కం ట్యాక్స్ కాలిక్యులేటర్ మీద క్లిక్ చేయాలి.
అడ్వాన్సుడ్ కాలిక్యులేటర్ ప్రకారం ఎంత పన్ను చెల్లించాలన్న విషయమై వివరంగా లెక్కగట్టవచ్చు.