ఆఖర్లో స్పీడ్ తగ్గింది
మారుతి సుజుకీ, హ్యుందాయ్ మినహా మిగతా ఆటో సంస్థల విక్రయాలు గత నెల పర్వాలేదనిపించాయి. డిసెంబర్లో మారుతి సుజుకీ దేశీయ అమ్మకాలు, అంతర్జాతీయ ఎగుమతులు కలిపి 1,37,551 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు డిసెంబర్లో ఇవి 1,39,347 యూనిట్లుగా నమోదవగా.. 1.28 శాతం తగ్గినట్టు తేలింది.
- డిసెంబర్లో మారుతి, హ్యుందాయ్ మినహా పర్వాలేదనిపించిన ఆటో సంస్థల అమ్మకాలు
న్యూఢిల్లీ, జనవరి 1: మారుతి సుజుకీ, హ్యుందాయ్ మినహా మిగతా ఆటో సంస్థల విక్రయాలు గత నెల పర్వాలేదనిపించాయి. డిసెంబర్లో మారుతి సుజుకీ దేశీయ అమ్మకాలు, అంతర్జాతీయ ఎగుమతులు కలిపి 1,37,551 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు డిసెంబర్లో ఇవి 1,39,347 యూనిట్లుగా నమోదవగా.. 1.28 శాతం తగ్గినట్టు తేలింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో తదితర ప్రవేశ స్థాయి మినీ కార్లకు డిమాండ్ పడిపోయింది. బాలెనో, సెలీరియో, డిజైర్, ఇగ్నీస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగనార్ మాడళ్లకూ ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని సంస్థ పేర్కొన్నది. అయితే బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంగ్జ్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6 కార్ల అమ్మకాలు పెరగడం విశేషం.
2023 మొత్తంగా..
గత ఏడాది మొత్తంగా ఆటో సంస్థల అమ్మకాలు ఆకట్టుకున్నాయి. దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 41.08 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2022తో పోల్చితే 8.3 శాతం వృద్ధి కనిపించింది. నాడు 37.92 లక్షల యూనిట్లే అమ్ముడయ్యాయి. తయారీదారుల నుంచి డీలర్లకు చేరిన వాహనాల్లో దాదాపు సగం ఎస్యూవీలే ఉండటం గమనార్హం. ఇక 2023లో వాహన సగటు ధర రూ.11.5 లక్షలుగా ఉన్నట్టు తేలింది. 2022లో ఇది రూ.10.58 లక్షలు.
కరోనాకు ముందు 2019-20లోనైతే రూ.8.2 లక్షలే. పెరిగిన ఉత్పాదక వ్యయమే ఇందుకు కారణమని పరిశ్రమ చెప్తున్నది. కాగా, గత ఏడాది దేశీయంగా మారుతి సుజుకీ వాహన విక్రయాలు తొలిసారి 20 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటానే 7.76 లక్షల యూనిట్లుగా ఉండటం విశేషం. ఎగుమతులు 2,69,046 యూనిట్లుగా ఉన్నాయి. హ్యుందాయ్ నిరుడు దేశీయంగా, ఎగుమతులు కలిపి 7,65,786 వాహనాలను అమ్మింది. 2022తో చూస్తే 9 శాతం పెరిగాయి.
- 2023లో మారుతి, టాటా, హ్యుందాయ్, టొయోటా కంపెనీలు అత్యుత్తమ అమ్మకాలను చవిచూశాయి.
- గత ఏడాది దేశీయ ఆటో పరిశ్రమ విక్రయాలు తొలిసారి 40 లక్షల మార్కును దాటాయి.
- మార్కెట్లో నిరుడు 26 శాతం ఎగిసిన ఎస్యూవీల డిమాండ్.
- 2023లో హ్యాచ్బ్యాక్, సెడాన్లకు తగ్గిన ఆదరణ. మల్టీ-యుటిలిటీ వాహనాల డిమాండ్ యథాతథం.
- టాటా మోటర్స్ గత ఏడాది 5.53 లక్షల వాహనాల్ని విక్రయించింది. ఎస్యూవీ, హచ్బ్యాక్ కార్లకు డిమాండ్.
- 46 శాతం వృద్ధితో నిరుడు 2,33,346 యూనిట్లను అమ్మిన టొయోటా.
- నిరుడు 18 శాతం ఎగిసి 56,902 యూనిట్లకు చేరిన ఎంజీ సేల్స్.

Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- auto companies
- hyundai
- maruti
- sales
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

