న్యూఢిల్లీ, జూన్ 13: గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. మే నెలలో రూ.103 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు నెల ఏప్రిల్‌లోనూ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి మదుపరులు రూ.124 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్‌లను సురక్షిత సాధనంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మార్చిలో మాత్రం రూ.266 కోట్ల పెట్టుబడులను వెనుకకు తీసుకున్నట్టు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సంఘం (యాంఫీ) గణాంకాలు చెప్తున్నాయి.