
హైదరాబాద్, డిసెంబర్ 17: పతంజలి స్పెషల్ చ్యవన్‌ప్రాశ్ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తమ శాస్త్రీయ పరిశోధనల్లో తేలినట్లు పతంజలి యోగ్‌పీఠ్ (ట్రస్ట్) ప్రకటించింది. ఈ అంశమై పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (పీఆర్ఐ) శాస్త్రవేత్తల బృందం విస్త్రత అధ్యయనం జరిపిందని, జ్వరం, దగ్గు, పడిశం తదితర రుగ్మతల్ని నివారించే గుణం స్పెషల్ చ్యవన్‌ప్రాశ్‌లో ఉందని రుజువుచేసారని పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ తెలిపారు. డాక్టర్ అనురాగ్ వర్ష్నే నేతృత్వంలో జరిగిన అధ్యయన వివరాల్ని సైంటిఫిక్ జర్నల్ ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఫార్మాకాలజీ’లో ప్రచురించారని, పరిశోధనా పత్రాన్ని జర్నల్ వెబ్సైట్లో చూడవచ్చని పతంజలి ట్రస్ట్ ప్రకటనలో పేర్కొంది.