Adani | అదానీ గ్రూప్ అంటేనే అంతులేని అనుమానాలు, అవకతవకల ఆరోపణలు. అందుకే అలా ఒక్కరాయి విసరగానే అదానీ కంపెనీల్లో కలకలం రేగుతున్నది. షేర్ల కోటలు కూలి కోట్లు కొట్టుకుపోతున్నాయి. హిండెన్‌బర్గ్ దెబ్బకు అతలాకుతలమైన గౌతమ్ అదానీపై మరో పిడుగుపడింది. ప్రమోటర్ గ్రూపుతో సంబంధం ఉన్న పలువురు వందల మిలియన్ల డాలర్లు అదానీ గ్రూపు స్టాక్ల్లో పెట్టుబడులు పెట్టారని, మారిషస్ నుంచి అక్రమంగా పెట్టుబడుల వరద పారిందని అంతర్జాతీయ సంస్థ ఆర్గనైజెడ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) బాంబు పేల్చింది. సంచలన ఆరోపణలతో ఓసీసీఆర్పీ విడుదల చేసిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మహా మాయగాడి అక్రమాల పుట్ట మరోసారి బద్దలైంది.కనీసం హైస్కూల్ చదువు కూడా పూర్తిచేయని స్కూల్ డ్రాపౌట్.. కుబేరుడిగా మారిన వైనం.. కండ్లకు కట్టినట్టు ఆవిష్కృతమైంది.
ప్రధాని మోదీ ఆప్తమిత్రుడు, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) సంచలన ఆరోపణలు చేసింది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో అక్రమాలు నిజమేనని సాక్ష్యాధారాలతోసహా బయటపెట్టింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ‘అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయి. ప్రమోటర్ల కుటుంబానికి బాగా దగ్గరి వ్యక్తులు అదానీ గ్రూప్ స్టాక్స్‌లో వందల మిలియన్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టి భారీగా లబ్ధి పొందారు. ఇందుకోసం మారిషస్ వంటి పలు దేశాల్లోని అనుమానాస్పద ఫండ్లను మాధ్యమంగా ఉపయోగించుకొన్నారు’ అని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ నెట్వర్క్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) సంచలన ఆరోపణలు చేసింది. హిండెన్‌బర్గ్ రిపోర్టుతో ఇప్పటికే చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు తయారైన అదానీ గ్రూప్‌నకు ఓసీసీఆర్పీ నివేదిక మరో భారీ ఎదురుదెబ్బ. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు పలు ఆధారాలు బయటపెట్టిన ఓసీసీఆర్పీ పరిశోధనాత్మక జర్నలిస్టుల నెట్వర్క్. వ్యవస్థీకృత నేరాలు, అవినీతి, ఆర్థిక అవకతవకలకు సంబంధించి లోతైన విశ్లేషణలు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టులతో కూడిన బలమైన ఇన్వెస్టిగేటింగ్ నెట్వర్క్ అది. రష్యాను కుదిపేసిన పన్ను కుంభకోణం మ్యాగ్నిట్స్కై, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పనామా పేపర్స్, భారత్‌తో సహా 30 దేశాల ఎన్నికలను ప్రభావితం చేసిన టీమ్ జార్జ్ తదితర హైప్రొఫైల్ కేసుల్లో ఓసీసీఆర్పీ అంచనాలే నిజమయ్యాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ అవకతవకలపై ఓసీసీఆర్పీ పలు ఆధారాలు బయటపెట్టడం గమనార్హం.
కుప్పకూలిన షేర్లు.. 35 వేల కోట్లు ఆవిరి
ఓసీసీఆర్పీ పేల్చిన బాంబుతో మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు అతలాకుతలమయ్యాయి. పది షేర్లలో తొమ్మిది 4శాతం వరకు నష్టపోయాయి. ఫలితంగా రూ.35 వేల కోట్లకు పైగా మార్కెట్ విలువ ఒక్కరోజులోనే హారతి కర్పూరంలా కరిగిపోయింది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయి. ప్రమోటర్ల కుటుంబానికి బాగా దగ్గరి వ్యక్తులు అదానీ గ్రూప్ స్టాక్స్‌లో వందల మిలియన్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టి భారీగా లబ్ధి పొందారు. ఇందుకోసం మారిషస్ వంటి పలు దేశాల్లోని అనుమానాస్పద ఫండ్లను మాధ్యమంగా ఉపయోగించుకొన్నారు. ఈ మేరకు అదానీ గ్రూప్ కంపెనీలపై ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ నెట్వర్క్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) సంచలన ఆరోపణలు చేసింది.
Occrp
ఓసీసీఆర్పీ నివేదికలోని ప్రధానాంశాలు
గౌతమ్ అదానీ ఆస్తి ఎప్పుడెలా?
2013: రూ.17,000 కోట్లు (నరేంద్ర మోదీ గుజరాత్కుసీఎంగా ఉన్నప్పుడు)
2020: రూ.1.6 లక్షల కోట్లు (మోదీ ప్రధాన మంత్రిగా దేశాన్ని పాలిస్తున్నప్పుడు)
2023, జనవరి 23: రూ.9.8 లక్షల కోట్లు (హిండెన్‌బర్గ్ నివేదికకు ముందురోజు)
2023, మార్చి 31: రూ.3.8 లక్షల కోట్లు(హిండెన్‌బర్గ్ వివాదం కొనసాగుతున్నప్పుడు)
2023, ఆగస్టు 30: రూ.4.5 లక్షల కోట్లు (ఓసీసీఆర్పీ నివేదికకు ముందురోజు)