Nokia 3210 4G | మళ్లీ భారత్ మార్కెట్లోకి నోకియా 3210 4జీ.. రూ.3999లకే లభ్యం..!
Nokia 3210 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. తన ‘నోకియా’ బ్రాండ్‌పై ‘నోకియా 3210 4జీ (2024)’ ఫోన్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది.
Nokia 3210 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. తన ‘నోకియా’ బ్రాండ్‌పై ‘నోకియా 3210 4జీ (2024)’ ఫోన్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. 25 ఏండ్ల క్రితం 1999లో మార్కెట్లోకి వచ్చిన ఇదే ఫోన్ తాజాగా నోకియా అభిమానులను ఆలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ ధర రూ.3,999గా నిర్ణయించింది హెచ్ఎండీ గ్లోబల్. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, హెచ్ఎండీ ఈ-స్టోర్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. వై2కే గోల్డ్, స్కూబా బ్లూ, గ్రుంజ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లేతో వస్తున్న నోకియా 3210 ఫోన్ యూనిసోక్ టీ 107 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 2 -మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కలిగి ఉంటుంది. 64 ఎంబీ ర్యామ్ అండ్ 128 ఎంబీ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో అదనంగా 32 జీబీ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. యూ-ట్యూబ్, యూ-ట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ తదితరాల కోసం వేర్వేరు యాప్స్ జత చేశారు. స్నేక్ గేమ్ కొనసాగనున్నది. 1450 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో 9.8 గంటల టాక్ టైం ఉంటుంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎంపీ 3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

