హైదరాబాద్, ఆగస్టు 21: ఐసీఐసీఐ లాంబార్డ్..ఆరోగ్య బీమా రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఎలివేట్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ బీమా పాలసీలో యాడ్-ఆన్‌లతో లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. ఊహించని వైద్య అత్యవసర పరిస్థితుల అవసరాలను తీర్చడానికి ఈ పాలసీని రూపొందించినట్లు కంపెనీ హెడ్ వివేక్ శ్రీవాత్సవ తెలిపారు. పరిమిత కవరేజ్‌తో పాలసీదారులకు నిరంతర కవరేజ్ ఇవ్వనున్నదని, యాడ్-ఆన్ అస్తమా, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఊబకాయ వంటి వ్యాధులు ఉన్నవారు 30 రోజుల తర్వాత పాలసీ ప్రయోజనం పొందవచ్చునన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: పాల ఉత్పత్తుల విక్రయ సంస్థ అమూల్ అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగావున్న ఫుడ్ బ్రాండ్లలో అత్యంత బలమైన బ్రాండ్‌గా అమూల్ నిలిచింది. ఈ విషయాన్ని ఫుడ్ అండ్ డ్రింక్ 2024 పేరుతో బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ పాల ఉత్పత్తుల బ్రాండ్లలో ఇప్పటికే తొలి స్థానంలో కొనసాగుతున్న అమూల్.. తాజాగా ఫుడ్ బ్రాం డ్లలో కూడా ఇదే స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.