ముంబై, సెప్టెంబర్ 22: ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘ఫెస్టివ్ బొనాంజా’ను ప్రకటించింది. గృహ, వాహన, వ్యక్తిగత, ట్రాక్టర్, గోల్డ్, ద్విచక్ర వాహన రుణాలపై ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నది.
దీంతోపాటు బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కన్జ్యూమర్ ఫైనాన్సింగ్, కార్డ్ రహిత ఈఎంఐలపై రూ.25 వేల వరకు రాయితీ, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఇస్తున్నది.