ICICI Bank | దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్.. గతేడాదితో పోలిస్తే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 34.2 శాతం వృద్ధితో రూ.8,312 కోట్ల లాభం గడించింది. నికర వడ్డీ ఆదాయం 34.6 శాతం పెరిగి రూ.16,465 కోట్లకు పెరిగింది. 2021-22తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 4.65 శాతం వృద్ధి చెందింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 3.96 శాతం నికర వడ్డీ మార్జిన్ లభిస్తే, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 4.31 శాతం పెరిగింది.
మరోవైపు డిసెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర మొండి బకాయిల నిష్పత్తి 0.55 శాతానికి దిగి వచ్చింది. సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 0.61 శాతం తక్కువ. మరోవైపు బ్యాంకు డిపాజిట్లు 10.3 శాతం రూ.11,22,049 కోట్లకు పెరిగాయి. ఇక వివిధ రుణాల మంజూరులోనూ 19.7 శాతం గ్రోత్ నమోదైంది.