ICICI Bank Credit Cards | గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అయితే, క్రెడిట్ కార్డుల వాడకంపై పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేసిన 21 రకాల క్రెడిట్ కార్డుల దారులకు ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్లు, రివార్డు పాయింట్లు పొందొచ్చు. కొన్ని బెనిఫిట్లు, రివార్డు పాయింట్లు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. అవేమిటో చూద్దామా..!
* ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి గత త్రైమాసికంలో క్రెడిట్ కార్డుతో రూ.35 వేలు ఖర్చు చేస్తే ఒక కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ లభ్యం.
* ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం సదరు క్రెడిట్ కార్డుదారులు అంతకుముందు త్రైమాసికంలో రూ.35 వేలు ఖర్చు చేస్తే అంతర్జాతీయ విమానాశ్రయం లాంజ్‌లో ఒక కాంప్లిమెంటరీ పాస్ పొందొచ్చు. ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికం నాటికి రూ.35 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
* విదేశాల్లో భారత్ కరెన్సీలో లావాదేవీలు జరిపితే ప్రస్తుతం చెల్లించే పన్నులతోపాటు ఒక శాతం డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (డీసీసీ) ఫీజు.
* వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అన్ని రకాల ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ప్రభుత్వ యుటిలిటీ సేవల బిల్లు చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు.
* ఇంటి అద్దె, ఈ-వాలెట్ లోడింగ్ లావాదేవీలపై వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రివార్డు పాయింట్ల నిలిపివేత. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుకు మినహాయింపు.
* ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డు
* ఐసీఐసీఐ బ్యాంక్ సెక్యూర్డ్ కోరల్ క్రెడిట్ కార్డు
* ఐసీఐసీఐ బ్యాంక్ లీడ్ ది న్యూ కోరల్ క్రెడిట్ కార్డు
* ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ క్రెడిట్ కార్డు
* ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ వయా క్రెడిట్ కార్డ్.
* ఐసీఐసీఐ బ్యాంక్ మాంచెస్టర్ యునైటెడ్ ప్లాటినం క్రెడిట్ కార్డు
* ఐసీఐసీఐ బ్యాంక్ పరాక్రమ్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్
* ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సెక్యూర్డ్ కోరల్ వీసా క్రెడిట్ కార్డ్
* ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్
* ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్
* ఐసీఐసీఐ బ్యాంక్ వీసా కార్డ్ మైన్ క్రెడిట్ కార్డు
* ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ మాస్టర్ క్రెడిట్ కార్డ్
* చెన్నై సూపర్ కింగ్స్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
* ఐసీఐసీఐ బ్యాంక్ బిజినెస్ బ్లూ అడ్వాంటేజ్ కార్డ్
* ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్
* ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ కోరల్ క్రెడిట్ కార్డ్
* ఐసీఐసీఐ బ్యాంక్ మాస్టర్ కార్డ్ కోరల్ క్రెడిట్ కార్డ్
* మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్
* స్పీడ్జ్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
* ఐసీఐసీఐ బ్యాంక్ మేక్‌మై ట్రిప్ మాస్టర్ కార్డ్ బిజినెస్ ప్లాటినం క్రెడిట్ కార్డ్
* మైన్ కార్డ్ ఐసీఐసీఐ బ్యాంక్ మాస్టర్ కార్డ్