Home Loans | దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్‌తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఇండ్ల రుణాలతోపాటు వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి. వివిధ టెన్యూర్ల రుణాలపై మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) ఐదు బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. బుధవారం (2023, నవంబర్ ఒకటో తేదీ) నుంచే పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయని తెలిపాయి.
ప్రైవేట్ బ్యాంక్-ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) అన్ని టెన్యూర్ల లోన్లపై 5 బీపీఎస్ ఎంసీఎల్ఆర్ పెంచేసింది. దీని ప్రకారం ఓవర్నైట్తోపాటు నెల గడువు గల రుణంపై ఎంసీఎల్ఆర్ 8.50 శాతం, మూడు నెలల టెన్యూర్ లోన్‌పై 8.55, 6 నెలల గడువు రుణాలపై 8.90, ఏడాది గడువు లోన్‌పై ఎంసీఎల్ఆర్ తొమ్మిది శాతానికి పెంచింది.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ – బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఎంపిక చేసిన టెన్యూర్ లోన్లపై ఎంసీఎల్ఆర్ 5 బీపీఎస్ పెంచేసింది. దీంతో ఓవర్ నైట్ టెన్యూర్ లోన్‌పై 7.95 శాతం, నెల రోజుల గడువు రుణంపై 8.15, మూడు నెలల టెన్యూర్ లోన్ మీద 8.35, ఆరు నెలల రుణం మీద 8.55, ఏడాది గడువు గల రుణంపై 8.75, మూడేండ్ల టెన్యూర్ లోన్‌పై ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి పెరిగింది.