హైదరాబాద్, డిసెంబర్ 16: ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను ఒక్కతాటిపై అందించాలనే ఉద్దేశంతో ఐబీవో సంస్థ…తెలంగాణలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను కంపెనీ సీఈవో వెంకటేశ్వర్ కుమార్ ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 175 బ్రాండ్లకు సంబంధించిన 4 వేలకు పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇతర మార్కెట్లో లభిస్తున్న వాటితో పోలిస్తే 30 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీకే కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్‌లో 4 నుంచి 5 స్టోర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు బెంగళూరు, చెన్నైలలో స్టోర్లను ఏర్పాటు చేసింది.