NSE Co-Location Scam | ఆనంద్ సుబ్రమణ్యన్ ఎవరో తెలియదన్న చిత్ర!
NSE Co-Location Scam | తనకు ఆనంద్ సుబ్రమణ్యన్ ఎవరో తెలియదని సీబీఐ విచారణలో ఎన్ఎస్ఈ ఎండీ కం సీఈవో చిత్ర రామకృష్ణ చెప్పారు.
NSE Co-Location Scam | ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ స్ట్రాటర్జిక్ ఆఫీసర్ కం ఎండీ సలహాదారు ఆనంద్ సుబ్రమణ్యన్ ఎవరో తనకు తెలియదని ఆ సంస్థ మాజీ సీఈవో కం ఎండీ చిత్ర రామకృష్ణ చెప్పారు. ఆనంద్ సుబ్రమణ్యన్‌ను, చిత్ర రామకృష్ణను పరస్పరం ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపితే ఆయన్ను గుర్తించడానికి నిరాకరించారు. 22 ఏండ్లుగా తాను యోగిని ఎప్పుడూ కలుసుకోలేదన్నారు. ఆనంద్ సుబ్రమణ్యన్‌కు, చిత్ర రామకృష్ణకు మధ్య 2,500 ఈమెయిల్స్ నడిచాయని సోమవారం కోర్టులో సీబీఐ ప్రాసిక్యూటర్ తెలిపారు. వీటిని పరిశీలించాల్సి ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే, ఎన్ఎస్ఈ ఎండీ కం సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనంద్ సుబ్రమణ్యన్‌ను చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్‌గా 2013 ఏప్రిల్ ఒటో తేదీన చిత్ర రామకృష్ణ నియమించుకున్నారు. ఆయన వేతనం రూ.1.68 కోట్లు ఖరారు చేశారు. తర్వాత గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఎండీ సలహాదారుగా ప్రమోట్ చేశారు. 2016 అక్టోబర్ 15 వరకు పని చేసిన ఆనంద్ సుబ్రమణ్యన్ తీసుకున్న చివరి వేతనం రూ.4.2 కోట్లు.
ఇదిలా ఉంటే, ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కాం, అల్టోరిథమ్ స్కామ్‌ల్లో భాగస్వాములైన ఎన్ఎస్ఈ, సెబీ అధికారులను గుర్తించాల్సి ఉందని సీబీఐ వాదించింది. ఈ కేసులో ప్రధాన నిందితులపై ఇప్పటికీ సీబీఐ చర్యలు తీసుకోలేదని జడ్జి తప్పుబట్టారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

