Hyundai Ai3 | భారత్ మార్కెట్లోకి హ్యూండాయ్ మోటార్స్.. మినీ ఎస్యూవీ వేరియంట్.. న్యూ ఎస్యూవీ కారును తీసుకు రానున్నది. గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సబ్-కంపాక్ట్ ఎస్యూవీ కారుకు `ఏఐ13 (సీయూవీ)` అనే కోడ్ నేమ్ కూడా ఖరారు చేసింది. ఫీచర్ల వివరాలేమీ బయట పెట్టకున్నా.. ఇటీవలే భారత్ రోడ్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించారని తెలుస్తున్నది. కస్టమర్లకు స్మార్ట్ మొబిలిటీ అనుభవం అందుబాటులోకి తేనున్నది. త్వరలో లాంచింగ్ తేదీని ప్రకటించనున్నది హ్యుండాయ్.. టాటా మోటార్స్ వారి టాటా పంచ్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నెట్ వంటి కార్లతో హ్యుండాయ్ `ఏఐ13` పోటీ పడుతుందని భావిస్తున్నారు.
హ్యుండాయ్ `ఏఐ13` మోడల్ కారు సిగ్నేచర్ పారామెట్రిక్ ఫ్రంట్ గ్రిల్లె, సర్క్యులర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ డీఆర్ఎల్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్క్వేర్ వీల్ ఆర్చెస్, ప్లాస్టిక్ క్లాడింగ్ అండ్ రూఫ్ రైల్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు కలిగి ఉంటుంది. రేర్‌లో పారామెట్రిక్ టెయిల్ లైట్స్ ఉంటాయి.
ఐకానిక్ 5వీ మోడల్ మాదిరిగా న్యూ-జెన్ స్టీరింగ్ వీల్, డాష్‌బోర్డుపై 42-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూ లింక్ కనెక్టివిటీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, మూడ్ లైటింగ్, వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్, సన్‌రూఫ్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఔరా మోడల్ కార్ల మాదిరిగా హ్యుండాయ్ కొత్తగా తీసుకొస్తున్న `ఏఐ13` వేరియంట్లో 1.2-లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఆప్షన్ ఉంది. ఈ ఇంజిన్ 82 బీహెచ్పీ విద్యుత్, గరిష్టంగా 113ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఇంజిన్‌పై లీటర్ పెట్రోల్ 20.1 కి.మీ. దూరం మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు.
హ్యుండాయ్ `ఏఐ13` కారులో లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొల్లిషన్ అవాయిడెన్స్ అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. హ్యుండాయ్ `ఏఐ13` మోడల్ కారు ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఈ మినీ ఎస్యూవీ కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏటా 50 వేల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఎస్యూవీ. భారతీయ కస్టమర్లలో మరింత ఆసక్తి పెంచడానికి ఆసక్తిగా ఉన్నామని హ్యుండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హ్యూండాయ్) ఇండియా సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. తమ కస్టమర్లకు బెటర్ ఎస్యూవీ కారు అందుబాటులోకి తేవడం ద్వారా భారత్‌లో లీడింగ్ స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా హ్యుండాయ్ నిలుస్తుందన్నారు.