ఐదు నిమిషాలకొక క్రెటా
దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. లగ్జరీ లుకింగ్, సౌకర్యవంతంగా ఉండటంతో ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు కస్టమర్లు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. ఎనిమిదేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన క్రెటాను ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు.
- ఎనిమిదేండ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. లగ్జరీ లుకింగ్, సౌకర్యవంతంగా ఉండటంతో ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు కస్టమర్లు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. ఎనిమిదేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన క్రెటాను ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంటే ఐదు నిమిషాలకొక క్రెటాను విక్రయించినట్లు అయింది.
ఇటీవల సంస్థ అప్డేటేడె వెర్షన్ క్రెటాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారుకోసం కూడా కస్టమర్లు క్యూ కట్టారు. ఇప్పటి వరకు ఏకంగా 60 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. రూ.11 లక్షల ప్రారంభ ధరతో ఏడు రకాల్లో ఈ మాడల్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ.
కొత్త క్రెటా కారు కావాలంటే గరిష్ఠంగా ఏడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. అలాగే క్రెటాను ఇప్పటి వరకు 2.80 లక్షల యూనిట్లను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసింది. కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా హారియర్, మహీంద్రా స్కార్పియో-ఎన్, టయోటా అర్బన్ క్రూజర్, స్కోడా కుష్క్యూ, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ల నుంచి క్రెటా తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

