హైదరాబాద్, మే 10: హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ తమ సరికొత్త ఎస్యూవీ ‘ఎక్స్టర్’ బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌ల్లో రూ. 11,000 చెల్లించి కస్టమర్లు కారును బుక్ చేసుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.
కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(ఓ), ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్ వేరియంట్లలో ఈ పెట్రోల్, సీఎన్జీ ఆధారిత కారు అందుబాటులో ఉండనున్నది. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, హెచ్-సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డైమండ్ కట్ అల్లాయ్స్ తదితర నయా ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్నది. కాగా, ఈ ఎస్యూవీ ధరను ఈ ఏడాది జూలై ఆఖర్లోగానీ, ఆగస్టు ఆరంభంలోగానీ హ్యుందా య్ అధికారికంగా ప్రకటించవచ్చన్న అంచనాలున్నాయి.