న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్ కాంప్యాక్ట్ ఎస్యూవీ మోడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. వెన్యూ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన వెన్యూ ఎన్-లైన్ మోడల్ రూ.12.16 లక్షల ప్రారంభ ధరలో లభించనున్నది. గరిష్ఠంగా రూ.13.15 లక్షలుగా నిర్ణయించింది. 1.0 కాప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ ఏడు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్లు ఉన్నాయని తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ..ఈ ఏడాది దేశీయంగా కార్ల విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయే అవకాశం ఉన్నదని, సెమికండక్టర్ల కొరత తగ్గుముఖం పట్టడం డిమాండ్ పెరిగేందుకు దోహదం చేయనున్నదన్నారు.