Hyundai Venue | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన పాపులర్ ఎస్యూవీ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ 2024 కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్‌తో హ్యుండాయ్ వెన్యూ ఎస్ (ఓ)+ (Hyundai Venue S (O)+) కారును తీసుకొచ్చింది. అత్యంత తక్కువ ధరలోనే యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది హ్యుండాయ్. ఈ కారు ధర రూ.10 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. దీంతోపాటు డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీతో గ్రాండ్ ఐ10 సీఎన్జీ వర్షన్ కారునూ ఆవిష్కరించింది.
హ్యుండాయ్ వెన్యూ ఎస్(ఓ)+ కారు 1.2 లీటర్ల ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 83 హెచ్‌పీ విద్యుత్, 114 ఎన్ఎం టార్క్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో వస్తోంది. సమగ్ర సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందీ కారు. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), రివ్యూ కెమెరా, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ కలర్ టీఎఫ్టీ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే తదితర ఫీచర్లు కలిగి ఉంటుంది.
సబ్-4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లో పాపులర్ మోడల్ హ్యుండాయ్ వెన్యూ. మహీంద్రా ఎక్స్‌యూవీ300, టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం హ్యుండాయ్ వెన్యూ కారు ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.48 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది.