Hyundai i20 N Line | దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి కుర్రకారును లక్ష్యంగా చేసుకుని.. తన ఐ20 ఎన్ లైన్ (Hyundai i20 N Line) ఫేస్‌లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. హ్యుండాయ్ ఐ20 ఎన్ లైన్ ఎన్6 ట్రిమ్ వేరియంట్ రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ హై ఎండ్ డీసీటీ ఆటోమేటిక్ ఎన్8 ట్రిమ్ వేరియంట్ ధర రూ.12.32 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
సేఫ్టీ, డిజైన్, ఫీచర్లలో పలు మార్పులు తెచ్చిన హ్యుండాయ్.. తన ఐ20 ఎన్ లైన్ కారులో 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ అందుబాుటులోకి తెచ్చింది. ఇంతకుముందు ఐ20 మోడల్ కార్లలో టర్బో ఇంజిన్ వేరియంట్‌ను హ్యుండాయ్ తొలగించింది.
న్యూ హ్యుండాయ్ ఐ20 ఎన్ లైన్ కారు 1.0 లీటర్ల కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 118 బీహెచ్పీ విద్యుత్ ,172 ఎన్ఎం టార్క్ వెలువరించడంతోపాటు కొత్తగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ (డీసీటీ) కలిగి ఉంటుంది. నార్మల్, ఎకో, స్పోర్ట్ మోడ్స్ డ్రైవ్‌ల్లో పని చేస్తుంది.
కారులో ప్రయాణించే వారి సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి ఫీచర్లు జత చేశారు.
10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, వైర్ లెస్ ఫోన్ చార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ పాన్ సన్ రూఫ్, 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్ లైట్స్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.