ఆటో దిగ్గజం హ్యుందాయ్
కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ మన దేశంలో సుపరిచితమైన బ్రాండ్. దక్షిణ కొరియా రాజధాని సియోల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యుందాయ్ 193 దేశాల్లో కార్లను విక్రయిస్తున్నది. అదే దేశంలోని ఉల్సన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్‌లో ఏడాదికి 16 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి.
మరో కొరియా కార్ల కంపెనీ కియాలో హ్యుందాయ్‌కు 34 శాతం వాటా ఉంది. 1996లో భారత్‌లోకి ప్రవేశించిన సంస్థ తన సబ్సిడరీ హ్యుందాయ్ మోటర్ ఇండియా ద్వారా ఇక్కడి కార్ల మార్కెట్లో 16 శాతం వాటాను సంపాదించుకుంది. తమిళనాడులో రెండు ఉత్పత్తి ప్లాంట్లు ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో కొత్త మోడల్స్‌ను అభివృద్ధిపర్చే ఆర్ అండ్ డీ సెంటర్‌ను హ్యుందాయ్ ఇప్పటికే నిర్వహిస్తున్నది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన న్యూ మొబిలిటీ వ్యాలీలో కన్సార్షియం భాగస్వామిగా చేరనుంది. రూ.1,400 కోట్లు పెట్టుబడి చేయనుంది.
హ్యుందాయ్ మోటార్
ప్రధాన కార్యాలయం: సియోల్, దక్షిణ కొరియా
స్థాపించిన సంవత్సరం: 1967
ఉత్పత్తులు: లగ్జరీ కార్లు,వాణిజ్య వాహనాలు, ఇంజిన్లు
గ్లోబల్ ఆదాయం: 9,300 కోట్ల డాలర్లు (2021)
నికరలాభం: 450 కోట్ల డాలర్లు
ఉద్యోగుల సంఖ్య: 1,05,000
భారత్‌లో టర్నోవర్: 550 కోట్ల డాలర్లు
దేశంలో వార్షిక తయారీ కెపాసిటీ: 7.40 లక్షల యూనిట్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- hyundai
- korean
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

