Hyundai Creta EV | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ (Hyundai).. త్వరలో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానున్నది. పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ తో నడిచే హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyudai Creta EV) కారు 2026 ప్రారంభంలో మార్కెట్లోకి రానున్నది. ఎంజీ జడ్ఎస్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 లతోపాటు టాటా నెక్సాన్ ఈవీ, త్వరలో మార్కెట్లో రానున్న టాటా హారియర్ ఈవీ, హోండా ఎలివేట్ ఈవీ కార్లతో పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. పాత ఐసీఈ మోడల్ మాదిరిగా ఎలక్ట్రిక్ క్రెటా కారు ఉన్నా కొన్ని మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రీడిజైన్డ్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్లతోపాటు బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్లె, రీ పొజిషన్డ్ హ్యుండాయ్ లోగో, ఫ్రంట్ ఫెండర్ మౌంటెడ్ చార్జింగ్ పోర్ట్, 17- అంగుళాల ఎయిరోడైనమికల్లీ డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయని సమాచారం.
డిఫరెంట్ అప్హోల్స్టరీతో డాష్ బోర్డ్ లే ఔట్, ఇన్ఫోటైన్మెంట్, క్లస్టర్ ల కోసం ట్విన్ స్క్రీన్స్, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెకటెడ్ కార్ టెక్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ఫ్యూరిఫయర్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రానిక్ ఫ్రంట్ డ్రైవర్ సీట్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్ సూట్ తదితర ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ వివరాలు వెల్లడించకున్నా 45-50 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, సింగిల్ చార్జింగ్ తో 450 కి.మీ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. క్రెటా ఈవీతోపాటు ఆల్ ఎలక్ట్రిక్, టర్బో పెట్రోల్, ఎన్ఏ పెట్రోల్, టర్బో డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో వస్తుందని భావిస్తున్నారు.