Creta Electric | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ (Hyundai Motor India) భారత్ మార్కెట్లో తన క్రెటా ఎలక్ట్రిక్ (Electric Creta) కారును శుక్రవారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (Bharat Mobility Global Expo 2025)లో ప్రదర్శించింది. దీని ధర రూ.17.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.23.49 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. హ్యుండాయ్ ఎలక్ట్రిక్ క్రెటా (Hyundai Electric Creta) తోపాటు పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ సహా మల్టీపుల్ పవర్ ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇక ఎలక్ట్రిక్ క్రెటా (Creta Electric) కారు రెండు బ్యాటరీ ప్యాక్‌లు (42కిలోవాట్లు, 51.4 కిలోవాట్లు), ఐదు వేరియంట్లు – ఎగ్జిక్యూటివ్ (Executive), స్మార్ట్ (Smart), స్మార్ట్ (ఓ) (Smart (O), ప్రీమియం (Premium), ఎక్స్‌లెన్స్ (Excellence) వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 2015లో తొలుత భారత్ మార్కెట్లోకి వచ్చిన క్రెటా కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లతోపాటు ఎలక్ట్రిక్ అవతార్ (Electric Avatar)లోనూ అందుబాటులో ఉంటుంది.
క్రెటా ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తోపాటు 99కిలోవాట్ల హెచ్‌పీ మోటార్‌తో వస్తున్నది. ఈ బ్యాటరీ సింగిల్ చార్జింగ్‌తో 390 కి.మీ దూరం, 51.4కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తోపాటు 126 కిలోవాట్ల మోటార్ సింగిల్ చార్జింగ్‌తో 473 కి.మీ దూరం ప్రయానిస్తుంది. టాప్ వేరియంట్ కారు 7.9 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. 11కిలోవాట్ల ఏసీ హోం వాల్ బాక్స్ సాయంతో నాలుగు గంటల్లో పది శాతం నుంచి 100 శాతం వరకూ, డీసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో 58 నిమిషాల్లో 10-80శాతం చార్జింగ్ అవుతుంది.
క్రెటా ఎలక్ట్రిక్ (Creta Electric) కారు విశ్వజనీన EV-Specific డిజైన్ విడి భాగాలతో ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) మోడల్‌తోనే రూపుదిద్దుకుంది. ఇంటిగ్రేటెడ్ చార్జింగ్ పోర్ట్‌తోపాటు పిక్స్లేటెడ్ గ్రాఫిక్ గ్రిల్లె, కూలింగ్ అండ్ ఎయిరోడైనమిక్స్ కోసం యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్, పిక్సెలేటెడ్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్లు, లో రిసిస్టెన్స్ టైర్లతోపాటు 17- అంగుళాల ఎయిరో అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం హ్యుండాయ్ గ్లోబల్ పిక్సెల్ డిజైన్ లాంగ్వేజ్ స్ఫూర్తితో క్రెటా ఎలక్ట్రిక్ (Creta Electric) ఫీచర్లు రూపుదిద్దుకున్నాయి.
డ్యుయల్ టోన్ గ్రానైట్ గ్రే, డార్క్ నేవీ థీమ్‌తో కూడిన క్యాబిన్, ఈవీ – స్పెసిఫిక్ అప్‌గ్రేడ్స్‌తోపాటు బ్లెండింగ్ ఫ్యామిలియర్ లేఔట్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, విశ్వజనీన త్రీ – స్పోక్ స్టీరింగ్ వీల్ ఫీచరింగ్ మోర్స్ కోడ్ డిటైలింగ్ ఫీచర్లు ఉంటాయి.
వెంటిలేషన్‌తోపాటు 8-వేట్ పవర్డ్ ఫ్రంట్ సీట్ల వంటి అడ్వాన్స్డ్ కంఫర్ట్, కన్వీనెన్స్ ఫీచర్లతో క్రెటా ఎలక్ట్రిక్ వస్తున్నది. ఇంకా డ్రైవర్ సైడ్ మెమొరీ ఫంక్షన్, రేర్ సీట్ కంట్రోల్స్ టూ అడ్జస్ట్ ప్యాసింజర్ సీట్ ఫర్ ఎక్స్ట్రా లెగ్ రూమ్, స్పేసియస్ 433 లీటర్ల బూట్, అదనంగా 22-లీటర్ల ఫ్రంట్, బోస్ 8- స్పీకర్ ఆడియో, షిఫ్ట్ బై వైర్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, జియో సావన్ మ్యూజిక్ స్ట్రీమ్ తదితర ఫీచర్లు కూడా ఉంటాయి.
క్రెటా ఎలక్ట్రిక్ కారులో టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు కీలకం కానున్నాయి. అడాస్ స్మార్ట్ సెన్స్ లెవెల్ -2 సేఫ్టీ ఫీచర్లు, రీ జెనరేటివ్ బ్రేకింగ్ విత్ సింగిల్ పెడల్ డ్రైవ్ (ఐ-పెడల్), డిజిటల్ కీ, హ్యుండాయ్ బ్లూ లింక్ కనెక్టివిటీ విత్ 268 వాయిస్ కమాండ్స్, వెహికల్ టూ లోడ్ (వీ2ఎల్) ఫీచర్లు ఉంటాయి. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్ హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), స్ట్రక్చర్ బిల్ట్ విత్ అడ్వాన్స్డ్ హై స్ట్రెంత్ స్టీల్ (ఏహెచ్‌ఎస్‌ఎస్) వంటి 72 సేఫ్టీ ఫీచర్లు జత చేశారు.
వేరియంట్ – ఎగ్జిక్యూటివ్ – స్మార్ట్ – స్మార్ట్ (ఓ) – ప్రీమియం (ఎక్స్ షోరూమ్ ధర)
42 కిలోవాట్లు – రూ.17.99 లక్షలు – రూ.18.99 లక్షలు – రూ.19.49 లక్షలు – రూ. 19.99 లక్షలు
వేరియంట్ – స్మార్ట్ (ఓ) – ఎక్స్‌లెన్స్ (ఎక్స్ షోరూమ్ ధర)
51.4 కిలోవాట్లు – రూ.21.49 లక్షలు – రూ. 23.49 లక్షలు