Hyundai Alcazar |హ్యుండాయ్ మోటార్ ఇండియా కార్లలో పాపులర్ మోడల్ అల్కాజర్.. దాని అప్డేటెడ్ వర్షన్ కారును మంగళవారం దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఆరు లేదా ఏడు సీట్ల ఎస్యూవీ.. 1.5 టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్తో వస్తోంది. ఈ అప్డేటెడ్ అల్కాజర్ కారు ధర రూ.16.75 లక్షల నుంచి ప్రారంభమై రూ.20.25 లక్షల వరకు పలుకుతుంది. అల్కాజర్ కారు నాలుగు వేరియంట్లు – ప్రిస్టీజ్, ప్లాటినం, ప్లాటినం (ఓ), సిగ్నేచర్ (ఓ)ల్లో వస్తున్నది. ఆసక్తి గల కస్టమర్లు ఆన్లైన్లో గానీ, ఆథరైజ్డ్ డీలర్ల వద్ద గానీ రూ.25 వేలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు.