Hyundai Alcazar | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి తన హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. హ్యండాయ్ ఫ్లాగ్ షిప్ త్రీ రో ఎస్యూవీ కారు ఆవిష్కరణ తేదీ ఖరారు కావడంతో ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.25 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా గానీ, హ్యుండాయ్ డీలర్ల వద్ద గానీ ప్రీ బుకింగ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ తొమ్మిదో తేదీన హ్యుండాయ్ అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ కారు ఆవిష్కరిస్తారు. గత జనవరిలో న్యూ క్రెటా ఆవిష్కరించిన తర్వాత అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరణ ప్రధానం కానున్నది.
2022లో తొలి మూడు వరుసల ఎస్యూవీ అల్కాజర్‌ను హ్యుండాయ్ తొలిసారి భారత్ మార్కెట్లోకి తెచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకూ 75 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. సిక్స్ సీట్, సెవెన్ సీట్ లే ఔట్లతో మార్కెట్లోకి వచ్చింది హ్యుండాయ్ అల్కాజర్. మహీంద్రా ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీతోపాటు మరో మూడు యుటిలిటీ వాహనాలకు గట్టి పోటీ ఇస్తోంది హ్యుండాయ్ అల్కాజర్. హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు నాలుగు వేరియంట్లలో వస్తోంది. ఎగ్జిక్యూటివ్, ప్రిస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ వేరియంట్లలో వస్తోంది. నాన్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్ లోనూ అందుబాటులో ఉంటుంది. రోబస్టర్ ఎమరాల్డ్ మ్యాట్టె కలర్ థీమ్లోనూ లభిస్తుందీ కారు.
న్యూ జెనరేషన్ క్రెటా స్ఫూర్తితో హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు వస్తున్నది. ఫ్రంట్ లో హెచ్-షేప్డ్ నూతన సెట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్ యూనిట్స్, న్యూ బోల్డర్ విత్ అప్ డేటెడ్ గ్రిల్లె, చంకీయర్ స్కిడ్ ప్లేట్లు ఉంటాయి. 18-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. రేర్ లో నూతన సెట్ ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ లైట్ యూనిట్స్, న్యూ టెయిల్ గేట్, న్యూ స్పాయిలర్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టాఫ్ లాంప్, అప్ డేటెడ్ బంపర్, స్కిడ్ ప్లేట్ ఉంటాయి.
70కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లతో వస్తోంది హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్. న్యూ క్రెటాలో మాదిరిగా ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉంటాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, సీట్ వెంటిలేషన్ తదితర ఫీచర్లు ఉంటాయి. 40 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతోపాటు, పలు అడ్వాన్స్ డ్ సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. లెవెల్ 2 అడాస్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది.
రెండు ఇంజిన్ ఆప్షన్లు, మల్టీపుల్ గేర్ బాక్స్ చాయిస్ లతో వస్తోంది హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్. 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్ మిసన్ (డీసీటీ) యూనిట్) ఉంటాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 158 బీహెచ్పీ విద్యుత్, 253 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 1.5 లీటర్ల యూ2 సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 113 బీహెచ్పీ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.