ముంబై, ఆగస్టు 5 : హైదారాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ జెహ్ ఏరోస్పేస్.. సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్లో 11 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్టు మంగళవారం తెలియజేసింది. ఎలివేషన్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్ట్ల నుంచి సేకరించిన ఈ నిధులతో తయారీ సామర్థ్యం, కార్యకలాపాల విస్తరణ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.
గత నెల్లోనే ఇందులో ఇండిగో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. కాగా, విశాల్ సంఘ్వీ, వెంకటేశ్ ముద్రగళ్ల ఈ సంస్థను స్థాపించారు.