Tourists | విహారయాత్రలకు వెళ్లే వారికి గుడ్న్యూస్. భారతదేశం, మాల్దీవులు మధ్య సంబంధాలు తిరిగి పునరుద్ధరించారు. దీంతో హైదరాబాద్-మాల్దీవులు మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. విహార యాత్రకు వెళ్లే వారు మాల్దీవులుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో భారత్- మాల్దీవులు మధ్య సంబంధాలు పునరుద్ధరించడం ఆసక్తికర పరిణామం. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో హైదరాబాద్-మాలే మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసులు నడుపుతారు.
హైదరాబాద్ నుంచి అక్టోబర్ 31 మధ్యాహ్నం 12:40 గంటలకు ఇండిగో 6ఈ-1797 విమాన సర్వీసు బయలుదేరి వెళ్లింది. మాలే అంతర్జాతీయ విమానాశ్రయానికి 14:50 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి మాల్దీవులుకు 2.10 గంటల ప్రయాణం మాత్రమే ఉంది. మాలే నుంచి బయలుదేరిన 6ఈ-1798 నుంచి హైదరాబాద్ లోని జీఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 18:45 గంటలకు చేరుతుంది. మాలే నుంచి హైదరాబాద్ నగరానికి 3.30 గంటల ప్రయాణం ఉంటుంది.