హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): అసోచామ్ 14వ ‘అంతర్జాతీయ వార్షిక కాన్ఫరెన్స్ కమ్ అవార్డ్స్-సివిల్ ఏవియేషన్ 2023’లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మెరిసింది. జీఎమ్మార్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోగల రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్జీఐఏ) ‘సాంకేతిక వినియోగంలో ఉత్తమ విమానాశ్రయం’గా అవార్డు లభించింది. విమానాశ్రయంలో ఆవిషరణలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.
హైదరాబాద్ విమానాశ్రయం పటిష్టమైన భద్రతకు భరోసానిస్తూ వినూత్న సాంకేతిక పరిషారాలను అమలు చేయడంలో ముందంజలో ఉన్నది. దేశంలోని విమానాశ్రయ రంగంలో అనేక మొట్టమొదటి సాంకేతిక ఆవిషరణలకు జీఎమ్మార్ హైదరాబాద్ విమానాశ్రయం నాంది పలికింది. ఇందులో తొలి ఇంటిగ్రేటెడ్, సెంట్రలైజ్డ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఏవోసీసీ), ఈ-బోర్డింగ్ సొల్యూషన్, ఎక్స్‌ప్రెస్ చెక్-ఇన్, కెమెరా ఆధారిత కాంటాక్ట్‌లెస్ టెర్మినల్ ఎంట్రీ, ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టం (ఏటిఆర్ఎస్), ఎల్వోటి ఆధారిత స్మార్ట్ ట్రాలీ మేనేజ్మెంట్, ఏఐ ఆధారిత ప్యాసింజర్ ఫ్లో మేనేజ్మెంట్, కాంటాక్ట్‌లెస్ సీయూఎస్ఎస్, వర్చువల్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ డెస్, హెచ్‌వోఐ ఎయిర్పోర్ట్ యాప్ ద్వారా కాంటాక్ట్‌లెస్ ఎఫ్అండ్బి ఆర్డరింగ్, క్లౌడ్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థ, ఫాస్ట్ ట్యాగ్ కార్ పారింగ్ వంటివి ఉన్నాయి.