Discounts on New Car | కొత్త కారు కొనాలనే వారికి గుడ్న్యూస్.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలు!
Discounts on New Car | కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇది మీకు శుభవార్త. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఒకేసారి భారీగా రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు ఏకంగా తమ మాడళ్లపై రూ.2.15 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు వెల్లడించాయి.
Discounts on New Car | న్యూఢిల్లీ, జూన్ 6: కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇది మీకు శుభవార్త. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఒకేసారి భారీగా రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు ఏకంగా తమ మాడళ్లపై రూ.2.15 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు వెల్లడించాయి. ఈ ఆఫర్లు ప్రస్తుత నెలకు మాత్రమే వర్తించనున్నాయని, వీటిని నగదు డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, స్క్రాపింగ్ ఇన్సెంటివ్స్, లాయల్టీ రివార్డ్, కార్పొరేట్ ప్రయోజనాలు కలుపుకొని ఎంపిక చేసిన మాడళ్లపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపాయి.
హ్యుందాయ్..
హ్యుందాయ్ మోటర్స్ ఎంపిక చేసిన మాడళ్లపై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ను ఇస్తున్నది. క్రెటా ఎస్యూవీని కొనుగోలు చేసిన వారికి లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్న సంస్థ..వెర్నాపై రూ.95 వేలు, అప్డేటెడ్ మాడల్పై రూ.55 వేలు, క్రెటా ఎలక్ట్రిక్ మాడల్పై రూ.85 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చునని ఆటోకార్ ఇండియా తాజాగా వెల్లడించింది. వీటితోపాటు గ్రాండ్ ఐ10 నియోస్పై రూ.78 వేలు, అల్కాజర్పై రూ.75 వేలు, ఐ20, ఐ20 ఎన్ లైన్ మాడల్పై రూ.63 వేలు, ఎక్సటర్పై రూ.43 వేల డిస్కౌంట్, ఔరా మాడల్పై రూ.25 వేలు, వెన్యూపై రూ.5 ప్రయోజనాలు కల్పిస్తున్నది.
టాటా మోటర్స్…
పలు ప్యాసింజర్ వాహనాలపై రూ.55 వేల వరకు రాయితీ ఇస్తున్నట్టు టాటా మోటర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు 2026లో విడుదలైన ఎస్యూవీలు, పంచ్, టియాగో మాడళ్లు ఉన్నాయి. వీటిలో నెక్సాన్ఫై రూ.55 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్న సంస్థ..కర్వ్పై రూ.55 వేలు, హారియర్, సఫారీ ఎస్యూవీపై రూ.45 వేల వరకు, అల్ట్రోజ్ రూ.40 వేల వరకు, టియాగోపై రూ.35 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది.
మారుతి కార్లపై
మారుతి సుజుకీ కూడా రాయితీలను ప్రకటించింది. ఇన్విక్టో ఎంపీవీ పై రూ.2.15 లక్షల వరకు రాయితీ ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. దీంతోపాటు గ్రాండ్ విటారాపై రూ.1.35 లక్షల వరకు, ఇగ్నిస్పై రూ.45 వేలు, బాలెనోపై రూ.40 వేలు, ఎక్స్ఎల్ఆర్పై రూ.45 వేలు, జిమ్నీపై రూ.45 వేలు, ఫ్రాంక్స్పై రూ.25 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. వీటిలో ఎక్సేంజ్ బోనస్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఇస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

