Huawei P60 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే తన పీ60 సిరీస్ (Huawei P60) ఫోన్లను ఈ నెల తొమ్మిదో తేదీన గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. బేస్ హువావే పీ60 (Huawei P60) తోపాటు హువావే పీ 60ప్రో (Huawei P60 Pro), ప్రీమియం హువావే పీ 60 ఆర్ట్ (premium Huawei P60 Art) ఫోన్లు కూడా అదే రోజు ఆవిష్కరిస్తుంది. గత మార్చిలోనే చైనా మార్కెట్లోకి తీసుకొచ్చింది. పీ60 సిరీస్ ఫోన్లతోపాటు తమ ఫ్లాగ్ షిప్ ఉత్పత్తులను కూడా మార్కెట్లోకి తెస్తున్నట్లు హువావే ట్వీట్ చేసింది. ఇక ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+జెన్ 14 ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తున్నది.
హువావే పీ60, హువావే పీ 60 ప్రో మోడల్ ఫోన్లు రొకొకో పెరల్, వయోలెట్, బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. పీ60 ఆర్ట్ ప్రీమియం ఫోన్ మాత్రం అజూర్ బ్లూ, షీషోర్ గోల్డ్ కలర్స్ లో లభిస్తుంది.
హువావే పీ60 ఫోన్ 128 జీబీ వేరియంట్ ఫోన్ సుమారు రూ.54 వేలు (4488 చైనా యువాన్లు), 256 జీబీ, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్లు దాదాపు రూ.60 వేలు (4988 చైనా యువాన్లు), దాదాపు రూ.72 వేల (5988 చైనా యువాన్లు)కు లభిస్తాయి.
హువావే పీ60 ప్రో ఫోన్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ దాదాపు రూ.84 వేలు, 512 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.96 వేలకు లభిస్తాయి. హువావే పీ60 ఆర్ట్ ఫోన్ 512 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.1.08 లక్షలు, ఒక టిగా బైట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.1,32,200లకు సొంతం చేసుకోవచ్చు.
మూడు ఫోన్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ + ఎల్టీపీఓ ఓఎల్ఈడీ క్వాడ్ కర్వ్డ్ డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 14 జీ ఎస్వోసీ అండ్ సపోర్ట్ టూ వే బైదూ శాటిలైట్ మెసేజింగ్ తో వస్తున్నాయి.
హువావే పీ60 ఫోన్.. 48 -మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 13 మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగా పిక్సెల్ సెన్సర్ విత్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ తో వస్తున్నది. హువావే పీ60 ప్రో రేర్ కెమెరా మాడ్యూల్ లో రెండు 48-మెగా పిక్సెల్ సెన్సర్లు విత్ ఓఐఎస్, 13 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరాలు ఉంటాయి.
హువావే పీ60 ఆర్ట్ ఫోన్ కూడా రెండు 48 -మెగా పిక్సెల్ సెన్సర్లు విత్ ఓఐఎస్, లార్జర్ 40 -మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. మూడు వేరియంట్ ఫోన్లలోనూ సెల్ఫీల కోసం 13-మెగా పిక్సెల్ సెన్సర్ వాడుతున్నారు.
హువావే పీ60, హువావే పీ 60 ప్రో మోడల్ ఫోన్లు 4,815 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలు విత్ 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. అదనంగా పీ60 ఫోన్ 66 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, పీ60 ప్రో ఫోన్ 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. ఇక పీ60 ఆర్ట్ ఫోన్ 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 88 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నది.