HP Black Friday Deals | గ్లోబల్ టెక్ దిగ్గజం హెచ్పీ (HP) తన లాప్టాప్లు, డెస్క్ టాప్ కంప్యూటర్లపై ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. తన బ్లాక్ డే ఆఫర్ల కింద సెలెక్టెడ్ లాప్ టాప్ లు, డెస్క్ టాప్ కంప్యూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఓపెన్, విక్టస్, స్పెక్ట్రే, పెవిలియన్, ఎన్వే సిరీస్ లాప్ టాప్ లు, డెస్క్ టాప్ కంప్యూటర్లపై ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. ఇది పరిమిత ఆఫర్ అని, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు యూజర్లకు ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
ఈ నెల 27 నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకూ భారత్ కస్టమర్లకు బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు లభిస్తాయని తెలిపారు. రూ.79,999, అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే రూ.5,000 ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. లావాదేవీల విలువ రూ.99,999, అంతకంటే ఎక్కువగా ఉంటే రూ.8000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
హెచ్పీ విక్టస్, హెచ్పీ ఓమెన్ 16, హెచ్పీ ఓమెన్ 17, హెచ్పీ ఒమెన్ ట్రాన్స్ కెండ్ 14, హెచ్పీ ఓమెన్ 35ఎల్ గేమింగ్ డెస్క్ టాప్ కంప్యూటర్ పై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. హెచ్పీ ఓమెన్ ట్రాన్స్ కెండ్ 14 విత్ షాడో బ్లాక్ ఆప్షన్ రూ.1,74,999 నుంచి ప్రారంభం అవుతుంది. హెచ్పీ నుంచి వచ్చే ఇతర పర్సనల్ కంప్యూటర్లు – హెచ్పీ ఓమినీ బుక్ ఆల్ట్రా ఫ్లిప్, హెచ్పీ ఓమినీ బుక్ ఎక్స్, హెచ్పీ పెవిలియన్ ప్లస్ 14, హెచ్పీ ఎన్వీ ఎక్స్360, హెచ్పీ స్పెక్ట్రే ఎక్స్360, హెచ్పీ ఎలైట్ బుక్ ఆల్ట్రా జీ1క్యూ, హెచ్పీ డ్రాగన్ ఫ్లై జీ4 లపై డీల్స్ ఉన్నాయి. ఇక హెచ్పీ ఓమినీ బుక్ ఆల్ట్రా ఫ్లిప్ 14 ఆల్ట్రా 7 పీసీ ధర రూ.1.81,999, హెచ్పీ ఓమినీ బుక్ ఎక్స్ ధర రూ.1,39,999 నుంచి ప్రారంభం అవుతుంది.